Andhra PradeshHome Page Slider

వైసీపీకి బిగ్ షాక్

ఏపీలో వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఆ లేఖను ఆయన అసెంబ్లీ కార్యదర్శికి కూడా అందజేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గతకొంత కాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టికెట్‌ను అధిష్టానం బీసీలకు ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.కాగా ఈ కారణంగానే ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.