మాజీ సీఎం సొంత జిల్లాలోనే పార్టీకి బిగ్ షాక్
వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. గత మూడు నెలల నుంచి జగన్ తో మాట్లాడాలని చంద్ర ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి తనను పట్టించుకోలేదని చంద్ర ఆరోపించారు.

