Home Page SliderNational

టీమ్‌ఇండియాకు బిగ్ షాక్

మరికొన్ని రోజుల్లోనే WTCఫైనల్ ప్రారంభం కానుంది. అయితే దీనికి ముందే టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నొప్పి వల్లే  అశ్విన్ నిన్న PBKSతో మ్యాచ్‌కు చివరి నిమిషంలో దూరమైనట్లు RR కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపారు.  ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితిపై BCCI క్లారిటీ ఇవ్వాల్సివుంది.  కాగా ఇప్పటికే గాయాలతో టీమ్‌ఇండియా ప్లేయర్స్ రిషబ్ పంత్,కేఎల్ రాహుల్,శ్రేయాస్,బుమ్రా WTC ఫైనల్ దూరమయ్యారు. మరోవైపు శార్దూల్,జయదేవ్,ఉమేశ్ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో WTC ఫైనల్‌కు ఎవరు వెళ్తారా అని సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో BCCI ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందే వేచి చూడాల్సివుంది.