Home Page SliderNational

రిలయెన్స్ జియోకు భారీ షాక్

రిలయెన్స్ జియోకు కస్టమర్ల నుండి భారీ షాక్ తగిలింది. ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచిన తర్వాత యూజర్లు తగ్గిపోయారు. దాదాపు రెండవ త్రైమాసికంలో 1.07 కోట్ల మంది యూజర్లు జియో నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఒక్కో యూజర్ నుండి వచ్చే సగటు అదాయం మాత్రం పెరిగిందని జియో వెల్లడించింది. ఇది రూ.181.7 నుండి రూ.195.1కి పెరిగింది. దీనితో వినియోగదారులు తగ్గినా, లాభాలపై ప్రభావం చూపదని జియో ధీమా వ్యక్తం చేసింది. 5జీ సబ్‌స్రైబర్స్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగింది. దీనితో 147 మిలియన్లకు చేరుకుంది.