జగన్‌కు బిగ్ షాక్..టీడీపీ గూటికి చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో మరో 9 నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే ఆన రామనారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి ఆనం హైదరాబాద్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు.సుమారు ఓ గంటపాటు చంద్రబాబుతో ముచ్చటించారు. కాగా ఆయన నెల్లురులో తాజా రాజకీయ పరిణామాలపై చంద్రాబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే అభియోగంపై ఆనంను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు మాజీ మంత్రి,వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డితో భేటి అయ్యారు. వైసీపీలో ప్రాధాన్యత కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండడం ఇష్టంలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆనం రాంనారాయణరెడ్డి ఎప్పుడు టీడీపీ పార్టీలోకి చేరుతారో త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.