గూగుల్‌కు భారీ షాక్
గూగుల్ కంపెనీకి రష్యా కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కొన్ని కోర్టు పరమైన న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. దీనికి కారణం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిప్పుడు గూగుల్‌కు సంబంధించిన యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. మీడియా ఛానెల్స్ ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాయి. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌ను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతేకాక గూగుల్‌ను 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అంటే లెక్కపెట్టలేనని డాలర్లు చెల్లించాలి. ఈ విషయంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ గూగుల్‌పై ఎంత మొత్తం జరిమానా విధించారో తెలియదు కానీ, మా దేశ కంపెనీలపై గూగుల్ ఆంక్షలు సరైన విధానం కాదు. దీనితో గూగుల్ తన విధానం మార్చుకోవాలని కోరారు. దీనికి గూగుల్ స్పందిస్తూ రష్యా జ్యుడిషియరీలో చర్చించాలని, ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం ఉండవని తెలిపింది.