Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్ కు బిగ్ రిలీఫ్.. క్రిమినల్ కేసు ఎత్తివేత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై గతంలో నమోదైన క్రిమినల్ కేసును గుంటూరు స్పెషల్ కోర్టు ఎత్తివేసింది.
వాలంటీర్లను ఉద్దేశించి గతంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్తున్నారని, దండుపాళ్యం బ్యాచ్ మాదిరి తయారయ్యారని, వాలంటీర్ వ్యవస్థలో జవాబుదారీతనం లేదని ఆయన అన్నారు. దీంతో పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ కేసుపై పవన్ కల్యాణ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. మరోవైపు, గుంటూరు కోర్టు తాజా విచారణలో… పవన్ పై తాము ఫిర్యాదు చేయలేదని వాలంటీర్లు తెలిపారు. ఆ సంతకాలు తమవి కాదని చెప్పారు. దీంతో కేసును ఎత్తివేస్తూ గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు.