మోహన్‌బాబుకు ఊరట
మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన కుటుంబంలో గత రెండు రోజులుగా ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో ఆయనను విచారణకు రమ్మని పోలీసులు నోటీసులు పంపారు. అయితే తాను విచారణకు రాలేనని, ఈ నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం ఈ నోటీసులపై స్టే విధించింది. ఇవన్నీ వాళ్ల కుటుంబ వ్యవహారం అని, కేవలం మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మెడ, కాలు నొప్పి, హైబీపీతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి మోహన్ బాబు ఇంటివద్ద టీవీ జర్నలిస్టులపై దాడి చేశారని, ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయని మీడియా వారు అతడు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

