Home Page SliderTelangana

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో భారీ నోటిఫికేషన్

విద్యుత్ శాఖ నుంచి త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని ప్రకటించారు. విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చామని వివరించారు. ఇంధన శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త స్కీమ్ తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు.