Home Page SliderNational

క్రీడా రంగానికి భారీ బడ్జెట్ ప్రకటన..

2024-25 ఆర్థిక సంవత్సరానికి క్రీడా రంగానికి భారీ బడ్జెట్ కేటాయించారు ఆర్థిక మంత్రి. ఏకంగా క్రీడలకు రూ.3442.32 కోట్లు కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఖేలో ఇండియాకు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు రూ.340 కోట్లు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్లు కేటాయించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కు రూ.22.30 కోట్లు, డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలకు రూ. 22 కోట్లు కేటాయించారు.