Home Page SliderNational

రేపు భోళా శంకర్ ట్రైలర్ విడుదల చేయనున్న గ్లోబల్ స్టార్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్.ఏంటంటే మెగాస్టార్ నటించిన కొత్త సినిమా “భోళా శంకర్” ట్రైలర్ రేపు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భోళాశంకర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని చిత్రబృందం పేర్కొంది. అయితే మోహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ “భోళాశంకర్” సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లలిగా నటించారు.