1000 కిలోమీటర్ల మైలురాయి దాటిన భట్టి పాదయాత్ర
నేటితో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది తెలంగాణా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర. ఈ సందర్భంగా మీడిాయాతో ముచ్చటించారు భట్టి. తన పాదయాత్రలో బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణా ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నాన్నారు. కాంగ్రెస్ ఈ సారి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. గిరిజన ప్రజల సమస్యలు వింటుంటే బాధగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల మాటలు నీటిమూటలన్నారు భట్టి. సింగరేణి చాలా బలహీన పరిస్థితుల్లో ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణాలో పోడు భూముల సమస్యను తీరుస్తామన్నారు. ధరణి పోర్టల్‌ను బీఆర్‌ఎస్ పార్టీ వ్యక్తుల స్వలాభాల కోసమే ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వెల్లడించారు.