నూతన లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి
నూతన లోక్‌సభ నేడు ప్రారంభం కానుంది. దీనికి ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరిని నియమించారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఉదయం నూతన ప్రొటెం స్పీకర్ కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 26 నాటికి కొత్త స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. అయితే ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహకారం లభించడం లేదు. ఆయనకు సహాయంగా ఉండేందుకు నియమించబడిన సురేష్( కాంగ్రెస్), టి. ఆర్.బాలు(డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ(తృణమూల్ కాంగ్రెస్) సభ్యులు ఆయనకు సహకరించడం లేదు. భర్తృహరి నియామకంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కాంగ్రెస్‌కు చెందిన సురేష్ 8 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. భర్తృహరి 7 సార్లు ఎన్నికయ్యారు. సాధారణంగా ఎక్కువసార్లు ఎన్నికయినవారినే ప్రొటెం స్పీకరుగా ఎంపిక చేయడం సంప్రదాయం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని ఇండియా కూటమి వాదన.