భారతీయుడు-2 రిలీజ్‌కు అడ్డుపడిన మర్మకళ
భారతీయుడు -2 సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 12న విడుదల కానున్న ఈసినిమా రిలీజ్‌కు ఆ చిత్రంలో ముఖ్య యుద్ధవిద్య అయిన మర్మకళే కారణం. పార్ట్ 1 భారతీయుడు చిత్రంలో రాజేంద్రన్ రచించిన మర్మకళ అనే పుస్తకం ఆధారంగా సీన్లు చిత్రీకరించారు. కానీ పార్ట్ 2లో మర్మకళను టీజర్ రిలీజ్‌లో చూసిన ఆయన నివ్వెరపోయారు. ఎందుకంటే మర్మకళను భారతీయుడు 2లో తప్పుగా చూపించారంటూ ఆయన కోర్టుకెక్కారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ కోర్టు ద్వారా దర్శకుడు శంకర్, నిర్మాత లైకా ప్రొడక్షన్స్, హీరో కమల్ హాసన్‌కు నోటీసులు పంపించారు. దీనిపై ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలంటూ కోర్టు నోటీసులో పేర్కొంది. దీనితో ఈ చిత్రం మళ్లీ వాయిదా పడుతుందా అనేది ప్రశార్థకంగా మారింది. ఇప్పటికే 2020లో భారతీయుడు 2 చిత్రాన్ని ప్రకటించినప్పటి నుండి అంతరాయాలు వస్తున్నాయి. కరోనా కారణంగా కొన్నాళ్లు, తర్వాత కమల్ హాసన్ చిత్రం విక్రమ్ కారణంగా కొన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ఇప్పుడు విడుదలకు సిద్ధం కాగా, ఈ అవాంతరం వచ్చిపడింది. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ కాజల్ కూడా నటిస్తున్నారు. టీజర్‌లో కమల్ నటన అందరినీ ఆకట్టుకుంది.