భారత్ నేవీ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం
భారత్ నేవీ సేన మరింత బలం సంతరించుకుంటోంది. నౌకాదళ అణుశక్తిని మరింత శక్తివంతం చేస్తూ మూడు సబ్‌మెరైన్లు త్వరలోనే రాబోతున్నాయి. గురువారం ఆగస్టు 29న రెండవ అణుశక్తి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను జాతికి సమర్పించారు. మరో భారీ అణుశక్తి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అర్దమాన్ కూడా ఆరు నెలల్లోగా నౌకాదళంలో చేరబోతోంది. ప్రస్తుతం దీనికి సముద్రపరీక్షలు జరుగుతున్నాయి. ఇది అరిహంత్, అరిఘాత్ కంటే చాలా పెద్దది. ఈ ప్రాజెక్టులు రహస్యంగా 1990లో ప్రారంభించారు. మొత్తం వ్యయం రూ.90 వేల కోట్లు. చైనాకు తరహాలో ఆరు జిన్ శ్రేణి జలాంతర్గాములు జేఎల్-3 క్షిపణులు వీటికి అమర్చారు. ఇవి 10 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు. అరిఘాత్ నిర్మాణాన్ని విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో 2011లో మొదలుపెట్టారు. నిర్మాణం తొలిదశ పూర్తయ్యాక, 2017నవంబర్ 19న జలప్రవేశం జరిగింది. దీనికి అనేక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి, రాడార్ వ్యవస్థను, ఆయుధాలను సమకూర్చారు. సీ ట్రయల్స్‌ను పలు సార్లు చేపట్టి నిన్న జాతికి అంకితం చేశారు.