Home Page SliderNational

సామాన్యులకు అందుబాటులో భారత్ బ్రాండ్ బియ్యం..కిలో రూ.25కే

దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్స్‌లో బియ్యం ధరలు గత సంవత్సరం కంటే 15 శాతం పెరిగాయి. కేంద్రప్రభుత్వం భారత్ బ్రాండ్ బియ్యాన్ని సామాన్యులకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో కిలో రూ.25కే అమ్మే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ రైస్ పేరుతో ఈ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ (NCCF) ద్వారా అమ్మే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ భారత్ బ్రాండ్ పేరుతో రూ. 60 కే శనగపప్పు, రూ.27కే గోధుమ పిండి విక్రయాలు జరుగుతున్నాయి. దేశంలోని 2 వేల రిటైల్ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే బియ్యం ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై కేంద్రం పలు చర్యలు చేపట్టింది.