భారత్ బంద్ ఎందుకంటే…
నేడు భారత్ బంద్ ప్రకటించారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ ఆందోళనలు చేస్తున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం అఫిడవిట్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో వరంగల్, సిద్ధిపేట, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్ బస్ స్టేషన్లలో మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదుట భైఠాయించారు. ఈ వర్గీకరణని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్ వల్ల ఉద్యోగులు, విద్యార్థులు వారి పనులకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

