Home Page Sliderhome page sliderTelangana

నకిలీ ఆర్మీఅధికారులతో జాగ్రత్త..

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు సరిహద్దులో కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా ఇవాళ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక పోస్ట్ చేశారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని, అందినకాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లించవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ దోస్త్ ఫొటోను సజ్జనార్ షేర్ చేశారు. కేంద్ర బలగాల పేరుతో ఫేక్ డొనేషన్స్ సేకరిస్తారని, డొనేషన్ రిక్వెస్ట్ వస్తే.. చేసే ముందు వెరిఫై చేసుకోవాలని స్పష్టం చేశారు. అనుమానం వస్తే.. దాన్ని రిపోర్ట్ కొట్టాలని, cybercrime. gov.inకు ఫిర్యాదు చేయాలని సూచించారు.