Home Page Slider

ఇంకో రౌండ్ ఉందంట.. మరోసారి జోరువానలు తప్పవంట.. ఎక్కడంటే..!?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇప్పుడే కొంచం వర్షాల నుంచి కుదుటపడుతున్నాయి అనుకునే లోపు మళ్ళి మరో ముంపు ముంచుకొని వస్తుంది. వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వర్షం కురిసింది. జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.