Andhra PradeshHome Page Slider

దేవుడి పేరుపై బెట్టింగ్ యాప్..

పవిత్రమైన వేంకటేశ్వర స్వామి పేరుతో ‘గోవిందా’ అనే బెట్టింగ్ యాప్ ను కొన్ని సంవత్సరాలుగా పేరు మోసిన సినీ తారలు నడుపుతున్నారని ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ‘ఎక్స్’ వేదికగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘గౌరవనీయులైన మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మనవి.. పవిత్రమైన వేంకటేశ్వర స్వామి పేరుతో ‘గోవిందా’ అనే బెట్టింగ్ యాప్ ను కొన్నేళ్లుగా పేరు మోసిన సినీ తారలు తమన్నా ఇంకా చాలామంది ప్రముఖులు, టెలిగ్రామ్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వెబ్ సైట్లలో నడిపిస్తున్నారు. అమాయకమైన యువతను వీటి నుంచి కాపాడండి అని..వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు.