Home Page SliderNational

బాలీవుడ్‌లో బెట్టింగ్ యాప్ కలకలం- శ్రద్ధాకు కూడా ఈడీ సమన్లు

బాలీవుడ్ ఇండస్ట్రీని బెట్టింగ్ నీలి నీడలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రముఖ నటీనటులకు ఈడీ నుండి సమన్లు జారీ అవుతున్నాయి. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నేడు నటి శ్రద్ధాకపూర్‌కు కూడా ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు అందాయి. కొద్ది రోజుల క్రితమే ప్రముఖనటుడు రణబీర్ కపూర్‌కు కూడా ఈ సమన్లు అందిన విషయం తెలిసిందే. అతనితో పాటు టీవీ షో హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమనులు హ్యూమా ఖరేషి,హానాఖాన్‌లకు కూడా సమన్లు అందాయి. రణబీర్ కపూర్ నేడు రాయపూర్‌లో హాజరు కావాల్సి ఉండగా రెండు వారాల సమయం కోరినట్లు తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ ఈడీ విచారణకు ఎప్పుడు హాజరవుతారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.