శుభాకాంక్షలు నానీ.. నీ విష్ నిజం కావాలి: అల్లు అర్జున్
దసరా సినిమాకు నాని ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు, అల్లు అర్జున్‌కు మధ్య ట్విట్టర్లో ఆసక్తికర సంభాషణ నడిచింది. నాని తన ఫిలింఫేర్ అవార్డు గురించి చెబుతూ చేసిన ట్వీట్‌కి బన్నీ కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. స్పందించిన నాని, వచ్చే ఏడాది మీ రూల్కి కూడా అనేక అవార్డులు దక్కాలంటూ అభిలషించారు. తాను కూడా అది నిజం కావాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ బదులిచ్చారు.