నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం వాక్ అవుట్
నీతి ఆయోగ్ సమావేశం నుంచి బెంగాల్ సీఎం మమత వాక్ అవుట్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా తాను మాట్లాడుతుంటే మైక్ ఆఫ్ చేశారని సీఎం మమత తెలిపారు. తనపై వివక్ష చూపుతున్నారని సీఎం ఆరోపించారు.ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు 20 నిమిషాలు,ఇతర నేతలు 15 నిమాలు మాట్లాడారన్నారు.అయితే తాను సమావేశానికి వచ్చినందుకు మీరు సంతోషించాలన్నారు. కాగా విపక్షం నుంచి తానొక్కదాన్నే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానన్నారు. అందుకే తాను మాట్లాడుతుంటే మైక్ ఆపేస్తున్నారని మమత మండిపడ్డారు. ఇలా చేయడం బెంగాల్‌కు,ప్రాంతీయ పార్టీలకు అవమానం అని మమత అధికార పక్షాన్ని దుయ్యబట్టారు.

