బెంగాల్ బంద్ అక్రమమేం కాదు..హైకోర్టు
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన బంద్ అక్రమమేం కాదని కోల్‌కత్తా హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది అక్రమం అంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాలతో ఇలాంటి పిల్స్ వేయొద్దని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ శివజ్ఞానం, జస్టిస్ హిరణ్మయ్ భట్టాచార్యలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిన్న జరిగిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం నాడు సెక్రటేరియట్ వరకూ ప్రజలు ర్యాలీ తలపెట్టారు. ఈ ర్యాలీని లాఠీఛార్జులు, టియర్ గ్యాస్ ప్రయోగాలతో అడ్డుకున్నారనే కారణంతో బీజేపీ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది.
