Home Page SliderTelangana

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఎదుట డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన

సీఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలింది. మొన్నటి వరకు కేసీఆర్ కు నీరాజనాలు పలికిన ప్రజలు ఇప్పుడు ఆయనకు నిరసన తెలియజేస్తున్నారు. గజ్వేల్‌కు చెందిన పలువురు డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులు ఫామ్‌హౌస్ గేటు వద్ద నిరసనకు దిగడంతో మాజీ ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లక్కీ డ్రాలో సుమారు 1100 మంది పేర్లు తీశారని, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావుతోపాటు ఇతర అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. గజ్వేల్‌లో ఉండి ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ గేటు ముందు చాలా సేపు నిరీక్షించినా కేసీఆర్ నుంచి పట్టింపు లేదన్నారు. ఫాంహౌస్ లోపల నుంచి తమకు ఫోన్ కూడా రాలేదని వాపోయారు.