చదువుల తల్లి సరస్వతిగా బెజవాడ దుర్గమ్మ
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడం విశేషం. సరస్వతీ అమ్మవారు చదువలకు అధిదేవతగా, వాగ్దేవతా మూర్తిగా విరాజిల్లుతుంది. ఆమెను దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారని నమ్మకం. ఈ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. నేను సాధారణ దర్శనాన్ని రద్దు చేసి, తెల్లవారుజాము 3 గంటల నుండే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేటినుండి నాలుగు రోజుల పాటు వరుసగా నవరాత్రులలో ముఖ్యమైన పండుగలు మొదలవుతాయి.


 
							 
							