పంచముఖ గాయత్రీమాతగా బెజవాడ దుర్గమ్మ..
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు రెండవ రోజైన విదియ నాడు బెజవాడ దుర్గమ్మ, గాయత్రిమాత అలంకారంలో దర్శనమిచ్చారు. పంచముఖాలతో వేదాలకు మూలదేవతగా గాయత్రిమాతను భక్తులు స్మరిస్తారు. కమలంపై కూర్చుని ఐదు ముఖాలతో చేతిలో వేదాలతో, అభయ హస్తాలతో దర్శనమిస్తున్న అమ్మవారిని చూడడానికి రెండుకళ్లూ చాలడం లేదు. నేడు గాయత్రిమాతకు కొబ్బరి అన్నాన్ని నివేదన చేశారు. మహత్తర శక్తి కలిగి జ్ఞానాన్ని ప్రసాదించే ఆదిశక్తి అవతారంగా భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.