వజ్ర కిరీటంతో బెజవాడ దుర్గమ్మ అలంకారం
నవరాత్రి ఉత్సవాలు నేడు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ భక్తులకు బాలత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. ఒక అజ్ఞాత భక్తుడు సమర్పించిన రూ.2.50 కోట్ల విలువ చేసే వజ్రకిరీటం నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ధరింపజేశారు. అశ్వయుజ పాడ్యమి అక్టోబర్ 3వ తేదీ నాడు మొదలైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 12 దశమి నాడు పరిసమాప్తమవుతాయి. భక్తులు ఈ సందర్భంలో విజయవాడకు పోటెత్తారు.

