Breaking Newscrimehome page sliderHome Page SliderNewsPoliticsTelangana

సేఫ్టీగా ఉండటం కూడా స్టైల్ గా ఉండటమే

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. #SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. సేఫ్టీగా ఉండటం కూడా స్టైల్ గా ఉండటమే అని ఆయన పేర్కొన్నారు . ఈ క్యాంపెయిన్ లో భాగంగా వాహనదారులు రోడ్డుపైకి వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, సీటు బెల్టు పెట్టుకోవడాన్ని చిన్న వీడియో తీసి ఆ వీడియోను ముగ్గురు స్నేహితులకు పంపించాలి. లేదా కుటుంబ సభ్యులనూ ట్యాగ్ చేయాలని చెప్పారు ఈ మేరకు ఆయన ‘ఎక్స్ ‘ వేదికగా ట్వీట్ చేశారు . ” సేఫ్టీగా ఉండటం కూడా స్టైల్ గా ఉండటమే. ప్రతి రైడ్ మీకు అవకాశాలను ఇస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు.. మీ కుటుంబానికి రక్షణ కల్పించేందుకు. మీరు కారు లేదా బైక్ స్టార్ట్ చేసేముందు ఇవి గుర్తుపెట్టుకోండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. ఈ వీడియోను రికార్డ్ చేయండి లేదా ఫొటోను షేర్ చేయండి. దీన్ని ముగ్గురికి షేర్ చేయండి. ఈ విధంగా సోషల్ మీడియాలో మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. మనందరం కలిసి 2025 ను సేఫ్టీ ట్రెండ్ గా మారుద్దాం..” అని హైదరాబాద్ వీసీ సజ్జనార్ ‘ఎక్స్ ‘లో పేర్కొన్నారు .

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, వాటిలో సుమారు 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతి గంటకు సగటున 52 ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిలో 20 మంది మరణిస్తున్నారు. 2021లో రోడ్డు ప్రమాదాల్లో లక్షా 55 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 2022లో ఈ సంఖ్య మరో 9 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తెలంగాణలో కూడా ఈ పరిస్థితి భయానకంగా ఉంది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 26 వేలకుపైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, రోజుకు సగటున 18 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ప్రమాదాల పరంగా మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం పొందడం ఆందోళన కలిగించే అంశం. అతివేగం, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.8 గంటలైనా, 12 గంటలైనా రోడ్లపై ఉన్నప్పుడు , తప్పులు చేయకుండా మంచి ప్రవర్తనతో ఉండండి. భద్రత మీ చేతుల్లోనే ఉందని సజ్జనార్ పిలుపు నిచ్చారు