‘బెబింకా’ తుఫాన్ బీభత్సం..చైనా అతలాకుతలం
డ్రాగన్ చైనాను వరుస తుపాన్లు అతలాకుతలం చేస్తున్నాయి. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో నేటి ఉదయం భీకర తుఫాన్ చైనాను తాకింది. బెబింకా అనే పేరుగల ఈ టైఫూన్ చైనా అర్థిక నగరమైన షాంఘైలో విజృంభిస్తోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి తుఫాన్లు కనీవినీ ఎరుగమని వాతావరణ శాఖ అధికారులు పేర్కుంటున్నారు. గత 75 ఏళ్లలో ఇలాంటి తుఫాన్ చూడలేదన్నారు. 1949 టైఫూన్ గ్లోరియా తీవ్ర తుఫానుగా షాంఘైపై విరుచుకు పడిందని మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అంతటి తుఫాన్ రావడం అంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ఈ తుపాన్ కారణంగా పలు విమానాలు, రైళ్లు, రద్దయ్యాయి. పార్కులు, ఇతర ఎమ్యూజ్‌మెంట్ ప్రదేశాలను కూడా మూసివేశారు. ఇటీవలే చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ను యాగి తుపాన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

