Home Page SliderNational

చర్మ సౌందర్యానికి కొబ్బరి పాలు ఎంత ముఖ్యమో తెలుసా?

ఒక బకెట్ వేడి నీటిలో ఓ కప్పు గులాబీ రెక్కలు వేయాలి. ఆ తర్వాత ఒక కప్పు కొబ్బరి పాలు, అర కప్పు పన్నీరు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. సువాసనలీనుతుంది. ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకుని అందులో దూదిని ముంచి ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆ తర్వాత సుమారు పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రోజుకొకసారి ఇలా మూడు వారాల పాటు చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది, నలుపుదనం తగ్గుతుంది. అరకప్పు కొబ్బరిపాలలో టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి వలయాకారంగా మర్దన చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది.