ఏఐజీ ఆస్పత్రికి అందాల భామలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీల సందడి కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలను చూసి వచ్చిన అందాల భామలు ఇవాళ ఉదయం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి స్పెషలైజేషన్ తదితర అంశాలను వైద్యులు వారికి వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను అందాల భామలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

