Home Page SliderTelangana

స్లోగా వెళ్ళుమని చెప్పినందుకు కొట్టి చంపిండు..

హైదరాబాద్ లోని అల్వాల్ లో దారుణం జరిగింది. బైక్ పై స్పీడ్ గా వెళ్తున్న యువకుడిని ర్యాష్ గా వెళ్లద్దని వృద్ధుడు ఆంజనేయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వృద్ధుడిపై యువకుడు అమానుషంగా దాడి చేశాడు. నాకే ఎదురు చెపుతావా.. అంటూ ఇష్టం వచ్చిన్నట్లుగా కొట్టాడు. యువకుడి దాడిలో వృద్ధుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధుడు చనిపోయాడు. యువకుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.