బీఆర్ఎస్ లీడర్లను చెట్లకు కట్టేసి కొట్టండి
మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేస్తే రైతులు వారిని చెట్లకు కట్టేసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ధర్నా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే.. సాంకేతిక కారణాల వల్ల రాని వారిని వెతికి మరి బీఆర్ఎస్ వారితో అబద్ధాలు చెప్పిస్తున్నారన్నారు. ఫాంహౌస్ నుంచి పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, 24 గంటలు పని చేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలిక ఎక్కడుందని ప్రశ్నించారు.