అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్‌తో ‘బీ కేర్‌ఫుల్’
ఇంటర్నేషనల్ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు టెక్ నిపుణులు. అనవసర మెసేజ్‌లు, మోసపూరిత సమాచారాలు ప్రచారం చేస్తున్న వాట్సాప్ కాల్స్, స్కామ్‌లు చాలా ఎక్కువయిపోయాయి. గత కొద్ది రోజులుగా తెలుగురాష్ట్రాలలో చాలామందికి ఈ అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ సందేశాలు పంపుతూ ఉంటారు. లాటరీలు, లోన్స్ పేరుతో కూడా రకరకాల కాల్స్ వస్తున్నాయి. మలేషియా, వియత్నాం వంటి దేశాల ఐఎస్‌డీ కోడ్స్‌తో ఫోన్లు చేస్తున్నారు. వీటికి స్పందించవద్దని, వారి ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాలను సేకరించి, వారి అకౌంట్లలో డబ్బును స్వాహా చేస్తున్నారు. కొన్ని రకాల ఏజెన్సీల ద్వారా ఇండియాలోనే అంతర్జాతీయ నంబర్లు లభ్యమవుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు సైబర్ నిపుణులు.