ఈ మూడు రోజులు జాగ్రత్త..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతూ.. సాయంత్రం కాగానే ఉక్కపోత వేసి పలుచోట్ల ఒక్కసారిగా వర్షం పడుతోంది. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదవుతాయన్నారు. మిగిలిన జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీలకు చేరనున్నాయి. అవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావొద్దని సూచించారు.

