బీ అలర్ట్.. పసి పిల్లలను కొని అమ్మేస్తున్నారు..
పసిపిల్లలను విక్రయించే 12 మంది ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మయన్మార్ దేశానికి చెందిన దంపతులు నడిపిస్తున్నారని సమాచారం. కమిషనరేట్ పరిధిలో నివాసం ఉంటూ దందాను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. పేదరికంలో ఉన్న తల్లి దండ్రుల నుంచి పిల్లలను తక్కువ ధరకు కొనుగోలు చేసి పిల్లలు లేని దంపతులకు పెద్దమొత్తానికి విక్రయిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా పసిపిల్లలను అమ్మేసినట్టు సమాచారం. మరికొన్ని ఘటనల్లో కిడ్నాప్ చేసి విక్రయించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

