Home Page SliderInternational

పాండ్యా గాయంపై BCCI కీలక అప్‌డేట్

ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ మేనియా బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కోసం జట్టులన్నీ హోరాహోరీగా తవపడుతున్నాయి. కాగా ఇవాళ ఇండియా VS బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్  పాండ్యా కాలి మడమకు గాయం అయ్యింది. దీంతో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. కాగా దీనిపై BCCI కీలక అప్‌డేట్ ఇచ్చింది. హార్థిక్ గాయాన్ని అంచనా వేసేందుకు స్కానింగ్ కోసం తీసుకెళ్లామని పేర్కొంది. మ్యాచ్‌లో గాయపడిన అనంతరం హార్థిక్ నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ త్వరగా కోలుకోవాలని,స్కానింగ్ రిపోర్ట్ నార్మల్ రావాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.