పాక్ కు బీసీసీఐ షాక్
పాకిస్థాన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనబోదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు తెలిపింది. పాకిస్తాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ హెడ్ గా బాధ్యతలు కొనసాగుతున్నారు. దీంతో శ్రీలంక వేదికగా జూన్ లో జరిగే మహిళల ఆసియాకప్ తో పాటు.. సెప్టెంబర్ లో జరగబోయే పురుషులు ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ సమాచారం ఇచ్చింది. తాజా నిర్ణయంతో మెన్స్ ఆసియా కప్ ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంటే.. స్పాన్సర్స్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.