రేపు తెలంగాణ భవన్‌లో బీసీ నేతల సమావేశం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ భవన్ లో బీసీ నేతల సమావేశం జరగనుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు, కులగణన విషయంలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై చర్చ జరగనుంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీసీ ప్రజా ప్రతినిధులకు సమావేశానికి ఆహ్వానించనున్నారు.

