బీసీ సీఎం తెలంగాణ ప్రజల స్వప్నం-ఈటల రాజేందర్
ఎల్బీ స్టేడియంలో ఈటల గళం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఈ రాష్ట్రం అణగారినవర్గాలకు నిలయం అని బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని బీజేపీ ప్రకటించింది. దానిని అవహేళన చేస్తూ రాహుల్ మాట్లాడుతున్నారు. రాహుల్ బీసీలు 52 శాతం ఉన్నారు.. అనాదిగా రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్నా అందని ద్రాక్షలా మిగిలిందన్న విషయం తెలుసుకోండి… కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్నాళ్ళ అధికారంలో ఎందుకు బీసీని సీఎం చెయ్యలేదు అని ప్రశిస్తున్నా. తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దళితులను మోసం చేసిన పార్టీ BRS. కానీ ఒక OBC ను ప్రధాని చేసుకున్న పార్టీ బీజేపీ. మోదీ గారు వచ్చిన తరువాత 27 మంది కేంద్రమంత్రులను చేశారు. రాజ్యాధికారం అందిపుచ్చుకునే సమయం ఆసన్నమయింది. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే BRS ను బొందపెట్టాలి. ఇప్పుడు బీసీ జాతి మోసపోయే జాతి కాదు.. చైతన్యవంతం అయ్యింది. మోదీ గారు అండగా ఉండగా బీసీలను ఆపే శక్తి ఎవరికీ లేదు.

