తెలంగాణకు బీసీ సీఎం, ఎందుకంటే!?
దశాబ్దాల కల ఫలించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ… తెలంగాణకు బడుగులకు అధికారం దక్కలేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ జనాభాలో 90 శాతానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు అధికారం ఎండమావిగా మారుతున్న తరుణంలో వచ్చే రోజుల్లో అధికారాన్ని బడుగులకే దక్కాలంటే అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇప్పటికే ఆయా వర్గాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఒక ఆయుధంగా మార్చుకోవాలని తాజాగా జరిగిన ముదిరాజ్ మహాసభ ఆత్మ గౌరవ సభ నినదించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు బీసీ అభ్యర్థి ఖరారైతేనే, బడుగుల రాతల మారతాయని ముదిరాజ్ మహాసభలో నేతలు ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కీలక నేత, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ రాజేందర్‌ను బీసీ సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజ్‌లకు జరుగుతున్న అన్యాయాన్ని పెరేడ్ గ్రౌండ్లో జరిగిన మహాసభ వేదిక ద్వారా నాయకులు, కార్యకర్తలు ఎలుగెత్తి చాటారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముదిరాజ్ బిడ్డల జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని… ఏ విధంగా దోపిడీకి గురయ్యామన్నదానిపై నేతలు ఉదాహరణలతో సహా వివరించడంతో ఇప్పుడు వారిలో కసి అంతకంతకూ పెరుగింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం మారకుంటే బడుగుల రాతలు మారవని, బడుగుల రాతలు మారాలంటే బీసీ సీఎం అభ్యర్థి రావాలని నేతలంతా పిలుపునిచ్చారు. బీసీల్లో నాయకత్వ లక్షణాలు బలంగా ఉన్న ఈటల రాజేందర్ ను సీఎం అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తే బడుగులంతా ఏకమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీసీ సీఎం అభ్యర్థి ఐతే, అది తెలంగాణ సమాజానికి మరీ ముఖ్యంగా ముదిరాజ్‌లకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది అన్న భావన కలుగుతోంది.