Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

బీసీ సంఘాల ఆందోళన, రాష్ట్ర బంద్‌ కు పిలుపు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా గురువారం తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విచారణ జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు. హైకోర్టు స్టే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. గేట్‌ నెంబర్‌ 4 వద్ద బీసీ నాయకులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు స్టేతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోగా, ఈ పరిణామాల నేపథ్యంలో బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చాయి.