ఏపీ కురుక్షేత్రంలో డీబీటీ.. డీపీటీ మధ్యే యుద్ధం:సీఎం జగన్
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ రైతు పంట వేసే నాటి నుంచి కోత కోసే వరకు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదని అన్ని వసతులను రైతు భరోసా కేంద్రం రూపంలో సొంతూళ్లోనే ఏర్పాటు చేశాం. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు విమర్శిస్తే.. నేడు అదే రైతన్నను రాజుగా నిలిపి వ్యవసాయాన్ని పండగలా మార్చాం. విత్తనాలు మొదలు పంట కోతల అనంతరం ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయడం వరకు మీ బిడ్డ ప్రభుత్వం రైతున్నల వెంటే ఉంటుంది. రైతున్నల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మీ బిడ్డ లక్ష్యం. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నానన్నారు సీఎం జగన్.

ఏపీ కురుక్షేత్రంలో డీపీటీ.. డీబీటీ మధ్య యుద్ధం జరుగుతుందని.. మీ బిడ్డ ప్రభుత్వంలో పేదలు.. రైతన్నలకు మంచి చేయాలని చేస్తుంటే, అది భరించలేని చంద్రబాబు కడుపుమంటతో ఆ నిధులను తన బినామీలకు దోచుకో.. పంచుకో.. తినుకో.. పాలసీలో పంచి పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు మన పథకాలు.. పనులను కాపీ కొడుతున్నారని.. వైఎస్సార్ సీపీ పథకాలన్నీ కలిపి టీడీపీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు పులిహోరా కలిపారని.. బిస్మిల్లాబాత్ చేశారని సీఎం జగన్ చంద్రబాబుపై విురుచుకుపడ్డారు. సీఎంగా పనిచేసినంత కాలం ప్రజలకు ఏం మంచి చేయలేక.. ఇప్పుడు పొత్తుల కోసం పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు క్యారెక్టర్ ఒరిజినాలిటీ రెండూ లేవని సీఎం జగన్ విమర్శించారు.1995లోనే సీఎం అయిన చంద్రబాబు నేటికీ ఒక్క ఛాన్స్ అని అడగడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ మేనిపెస్టో సుదీర్ఘ పాదయత్రలో ప్రజలు కష్టాలను తడిమి చూసి.. అదే ప్రజల గుండె చప్పుడుగా పుట్టిందని భావోధ్వేగానికి లోనయ్యారు. కానీ చంద్రబాబు మెంటాలిటీ అది కాదని గెలిచే వరకు ప్రజలను బ్రతిమలడం గెలిచిన మేనిపెస్టోను చెత్తబుట్టలో పడేసి గెలిపించిన ప్రజలను వెన్నుపోటు పొవడమేనని పేర్కొన్నారు.