బతుకమ్మ సంబరాలు షురూ..
రేపటి నుండి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు షురూ అవుతున్నాయి. రేపటి నుండి తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పండుగ జరగనుంది. రేపు అమావాస్య కావడంతో ఎంగిలిపూల బతుకమ్మను పేర్చనున్నారు. పాడ్యమి నుండి మొదలుపెట్టి అటుకుల బతుకమ్మ,ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ,అట్ల బతుకమ్మ,అలిగిన బతుకమ్మ,వేపకాయల బతుకమ్మ,వెన్నెముద్దల బతుకమ్మ తయారు చేస్తారు. చివరిగా సద్దుల బతుకమ్మ తయారు చేసి సంబరాలు ముగిస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఇలా రోజుకో రకం బతుకమ్మలను పేర్చి చెరువులలో నిమజ్జనాలు చేస్తుంటారు.