పవన్ ఓట్ల శాతంపై బర్రెలక్క కామెంట్స్
తెలంగాణ ఎన్నికలలో జనసేన పార్టీ ఓట్లశాతంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్కతో పోల్చి, జనసేన అధినేత పవన్‌ను ఎద్దేవా చేశారు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్‌కు రాలేదని విమర్శించారు. ఈ విషయంపై బర్రెలక్క స్పందించారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అనీ, నేను పవన్ అభిమానిని అని పేర్కొన్నారు. ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయబలం వారిది పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడడం నాకు బాధగా అనిపించిందని, ఆయన చాలా మంచివారని కితాబిచ్చింది. నన్ను వాడుకుని ఆయనను తక్కువ చేయడం కరెక్టు కాదని ఇంటర్యూ ద్వారా ప్రజలకు తెలియజేసింది.