బ్యానర్లు చించేసి, అసెంబ్లీలో రచ్చ
బ్యానర్లు చించేసి, కాలర్లు పట్టుకుని స్పీకర్ ఎదుటే హోరా హోరీ కొట్టుకున్నారు జమ్ముకాశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు. కూర్చుని సామరస్యంగా చర్చించాల్సిన అసెంబ్లీలో ఎవరూ సంయమనం పాటించలేదు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆర్టికల్ 370ని పునరుద్దరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎన్సీ సభ్యులు. ఏఐపీ నేత ఖుర్షీద్ ఈ విషయంపై బ్యానర్ ప్రదర్శిస్తూ ఆందోళన మొదలుపెట్టారు. దీనితో బీజేపీ నేతలు తటాలున ముందుకు వచ్చి ఆ బ్యానర్‌ను చించేశారు. దీనితో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ గందరగోళంలో స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనితో మార్షల్స్ ద్వారా వారిని బయటకు పంపించారు.

