Home Page SliderTelangana

సీఎం సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా విరాళం

ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సాయంగా పలువురు ప్రముఖలు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఓబీ జీఎం రితేశ్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.