NationalTrending Today

బ్యాంకులకు వరుసుగా అన్ని రోజులు సెలవులా, ఇక జనం పరిస్థితేం కావాలి..!?

రాష్ట్రాల్లో ఈ నెల 13 నుంచి 18 వరకు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. (ఆర్బీఐ) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం ఈ వారం ప్రభుత్వ సెలవులు, పండుగలు, వారాంతాలతో సహా హాలిడేస్ ఉన్నాయి. దాని కారణంగా బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఇదే కాకుండా రెండు, నాల్గో శనివారాలు, ఆదివారం కలిసిరావడంతో బ్యాంకులకు వరుసగా హాలిడేస్ వచ్చాయి. ఐతే, ఈ సెలవులన్నీ కూడా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతున్నాయి.