హసీనాపై బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెపై అరెస్టు వారంట్ జారీ చేసింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేయాలంటూ ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదేశించారు. జూలైలో అక్కడ జరగిన మారణహోమం దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. ఈ నేరాలకు అప్పటి ప్రధాని హసీనాను బాధ్యురాలిగా చేస్తూ 60 ఫిర్యాదులు అందాయి. ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ చేసి, స్వదేశానికి రప్పిస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు పిలిపించేందుకు తాత్కాలిక యూనస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే హసీనాను అప్పగించే విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.